కేరళ అప్పు రూ.5 లక్షల కోట్లకు దాటింది: ప్రధాని

కేరళ అప్పు రూ.5 లక్షల కోట్లకు దాటింది: ప్రధాని

కేరళ అప్పు రూ.5 లక్షల కోట్లకు దాటిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్ర ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి LDF ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు. LDF, UDF పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని అందుకే ఒకరిపై మరొకరు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని ధ్వజమెత్తారు. NDA అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి డబ్బును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.