వైసీపీ కార్యాలయంపై దాడి.. పలువురిపై కేసు
AP: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనలో టీడీపీ, వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. 16 మంది టీడీపీ నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయగా.. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు మరో 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఛలో హిందూపురం వెళ్లకుండా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి.. నోటీసులు పంపారు.