పుతిన్ పర్యటన వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు

పుతిన్ పర్యటన వేళ  రాహుల్ కీలక వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ నాయకులను ప్రతిపక్ష నాయకులు కలవనీయకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. విదేశీ నాయకులను కలిసే సంప్రదాయం గత వాజ్‌పేయి, మన్మోహన్ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ అభద్రత భావం వల్లే ఆ సంప్రదాయాన్ని వదులుకుంటుందని విమర్శించారు.