VIDEO: అకాల వర్షం.. భారీ విధ్వంసం
ELR: జంగారెడ్డిగూడెం(మం) దేవులపల్లి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులను రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డులో నిలిపి ఉంచారు. అకస్మాత్తుగా షెడ్డుపై తాటిచెట్టు పడడంతో రెండు ద్విచక్ర వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.