లింగన్నపాలెంలో తప్పిన ప్రమాదం

లింగన్నపాలెంలో తప్పిన ప్రమాదం

NLR: కొండాపురం మండలం లింగన్నపాలెంలో ఆదివారం గాలి వర్షం దుమారం రేపింది. వర్షం ధాటికి నాలుగు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఒక వేప చెట్టు సైతం కూలినట్లు స్థానికులు తెలిపారు. వర్షం ధాటికి సత్యవోలు, అగ్రహారం, కొమ్మి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్తంభాలు నేలకొరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.