కీర్తి రత్న అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయురాలు

కీర్తి రత్న అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయురాలు

MNCL: భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బి.ఉషారాణికి కీర్తి రత్న అవార్డు లభించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఉషారాణి అందిస్తున్న సేవలకు గాను సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీశ్రీ కళా వేదిక అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 3న అవార్డు ప్రదానం చేయనున్నారు.