గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడం హర్షనీయం: ఎమ్మెల్యే

KMM: కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామపంచాయతీలో ఉత్తమ గ్రామపంచాయతీ వర్కర్‌ని శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య సాలువాతో సన్మానించారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ గ్రామ ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించడం హర్షినియమని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే తన శ్రమను గుర్తించి సన్మానించడం సంతోషకరమని కార్మికుడు అన్నారు.