కాంగ్రెస్‌లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు
KNR: మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులవడం సంతోషంగా ఉందన్నారు.