'రేపటి ఆర్.కృష్ణయ్య దీక్షను జయప్రదం చేయాలి'

'రేపటి ఆర్.కృష్ణయ్య దీక్షను జయప్రదం చేయాలి'

SRD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 25వ తేదీన ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్ష జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ కోరారు. మల్కాపూర్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నాయన్నారు.