డీసీపల్లిలో పొగాకు రైతుల ఆందోళన

డీసీపల్లిలో పొగాకు రైతుల ఆందోళన

NLR: మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.