ఇంద్రియాలలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
BHNG: స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు బుధవారం ఆపార్టీని వీడి BRS పార్టీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ బండి కృష్ణ గౌడ్, BRS బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధీరావత్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.