అనాధగా మారిన బాలుడికి ఆర్థిక సాయం అందజేత

అనాధగా మారిన బాలుడికి ఆర్థిక సాయం అందజేత

KNR: తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్‌కు, అదే గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు పేరం కిషన్ శుక్రవారం రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లతారాజేశం, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్, మాజీ వార్డు సభ్యులు ప్రభాకర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.