వైసీపీ నాయకుడిపై దాడిని ఖండించిన మాజీ మంత్రి
NLR: వెంకటాచలం మండల YSR కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌పై జరిగిన దాడిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, YCP రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఖండించారు. అయితే వారు నిన్న వెంకటాచలం చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. గోపాల్‌పై జరిగిన హత్యాయత్నం రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.