సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల

సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల

NLR: ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం అనంతసాగరం మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని సోమశిల జలాశయం నుంచి రెండవ పంటకు సాగు నీటిని విడుదల చేశారు. గంగమ్మ తల్లికి చీర సారే, జలహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.