గ్యాస్ ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

HYD: గచ్చిబౌలిలోని టీఎన్టీవోస్ కాలనీలో హంగ్రీ ఇడ్లీ అనే హోటల్ ఉంది. వంట మనుషులు రాజీవ్(35), శంకర్ (23) ఉదయమే వచ్చి స్టవ్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీక్ కావడం గుర్తించకుండా స్టవ్ వెలిగించడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్‌కు 30%, శంకర్‌కు 39% గాయాలయ్యాయి. బాధితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.