జైపూర్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
ASR: డుంబ్రిగూడలోని జైపూర్ జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకులోయ నుంచి డుంబ్రిగూడ వైపు వస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.