6.690 కిలోల గంజాయి పట్టివేత

6.690 కిలోల గంజాయి పట్టివేత

SKLM: సోంపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎస్సై పారినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద 6.690 కిలోల గంజాయిని గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు సీఐ మంగరాజు తెలిపారు.