ట్విన్స్‌లో ఒకరు ఆత్మహత్య

ట్విన్స్‌లో ఒకరు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా ఘనపూర్ గ్రామానికి చెందిన ట్విన్స్ 'ట్విన్స్ డే' రోజున కవలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరైన దుంపటి వినయ్ కుమార్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉగాది రోజున ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఇవాళ గంభీరావుపేట సమీప మానేరు వద్ద అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.