నీట్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

SKLM: మే 4న జరిగే నీట్ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, నీట్ పరీక్ష కేంద్రాల సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.