అతి తక్కువ ధరకే EV స్కూటీ
టీవీఎస్ తన EV పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన 'ఆర్బిటర్ V1'ను లాంచ్ చేసింది. BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) స్కీమ్ కింద దీని ధర రూ.49,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.8kWh బ్యాటరీ ఉండగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 86 కిమీల రేంజ్ ఇస్తుంది. 0-80% ఛార్జింగ్ కావడానికి 2:20 గంటల పడుతుంది. హిల్-హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.