ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

NDL: కోవెలకుంట్లలోని దాసరి వీధికి చెందిన నట్వ గణేశ్ (24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి శనివారం తెలిపారు. స్థానికంగా ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న గణేష్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.