ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి సంరక్షణపై అవగాహన
elr: గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ శక్తి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. పి.నిర్మల కుమారి మాట్లాడుతూ.. శక్తి సంరక్షణ అనేది కేవలం అవసరం మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా మారాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ డా.కె. స్వరూపరాణి మాట్లాడుతూ.. శక్తి సమర్థ వినియోగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.