VIDEO: బాలికల మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
కృష్ణా: పెడన మదర్సా నుండి నిన్న రాత్రి అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు బుధవారం గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపి, కాకినాడలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బాలికలను సురక్షితంగా పెడనకు తీసుకువచ్చామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై వెల్లడించారు.