ఈ నెల 13న జిల్లాలో ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 13న జిల్లాలో  ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

PPM: జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి నేతృత్వంలో ఈ నెల 13న ఉదయం 10.30 గం.ల నుంచి బలిజిపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనంతరం మధ్యాహ్నం 3.00 గం.ల నుంచి సీతానగరం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాలకు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వయంగా తీసుకుంటారని పేర్కొన్నారు.