తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జేసీ

ELR: రైతుల విజ్ఞప్తి మేరకు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పీ.ధాత్రి రెడ్డి తెలిపారు. ఆదివారం ఉంగుటూరు మండలం గోపినాథ్ పట్నం రైతు సేవా కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.