కీర్తి వ్యాఖ్యలు ప్లేయర్లను అవమానించడమే: గంభీర్
T20 WC ట్రోఫీతో ఆలయానికి వెళ్లడంపై మాజీ క్రికెటర్, TMC MP కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఒత్తిడిని అధిగమించి అందుకున్న విజయాన్ని నీరుగార్చడం, ప్లేయర్లను అవమానించడమేనని కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ట్రోఫీతో చర్చి, మసీదుకి ఎందుకు వెళ్లలేదని ఆజాద్ అడగ్గా.. దేశానికి ఎంతో మధురమైన ఈ క్షణాల్లో ఇలాంటివి సమాధానార్హమే కాదని, పట్టించుకోవాల్సి అవసరం లేదని గౌతీ స్పష్టంచేశాడు.