కుర్దిస్తాన్‌లో దాడి.. ధృవీకరించిన ప్రధాని
ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిని కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రధాని మస్రూర్ బార్జానీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పౌరుల భద్రత, ప్రయోజనాలు కాపాడుకునేందుకు కుర్దిస్తాన్ ప్రాంతానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు.