సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: దివ్యాంగులు అన్ని రంగాల్లో నిలదొక్కుకోవాలి అన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన దివ్యాంగులకు దాత ఇచ్చిన మూడు చక్రాల సైకిళ్లను ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పంపిణీ చేశారు.