'ప్రజల తరఫున పోరాటాలు చేయాలి'

VZM: చంద్రబాబు హామీలు అమలు చేసేందుకు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. శనివారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ గజపతినగరం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.