సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో రూ. 37 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లంపూడి గ్రామం కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.