యుద్ధం.. 486 మంది మృతి

యుద్ధం.. 486 మంది మృతి

లెబనాన్ ‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 486 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరణించిన వారితో పాటు ఇప్పటివరకు 1,313 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులతో ఆస్పత్రులు నిండిపోవడంతో అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొంది. దాడుల భయంతో సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస తెలిపింది.