ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో జిల్లాకు మొదటి స్థానం

KDP: వెనుకబడిన కడప జిల్లాలను అభివృద్ధి చేయడం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఆస్పిరేషనల్ జిల్లాల్లోనే కడప జిల్లా 73.6 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు.