VIDEO: కప్పర్లలో పర్యటించిన సివిల్ సర్వీసెస్ అధికారులు
ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో సివిల్స్ సర్వీసెస్ అధికారులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించి ప్రజలకు అందజేస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. MPDO మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్, సిబ్బంది తదితరులున్నారు.