బసాపురంలో పారిశుద్ధ్యం అధ్వానం

బసాపురంలో పారిశుద్ధ్యం అధ్వానం

KRNL: ఆదోని సమీపంలోని బసాపురం గ్రామంలో పారిశుద్ధ్యం దయనీయంగా మారింది. రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో ప్రజలు బురదలోనే నడవాల్సి వస్తోంది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రత వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.