VIDEO: బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి
SRCL: తంగళ్ళపల్లి, సిరిసిల్ల మానేరు వాగు బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి గల్లంతయిన ఘటన తంగళ్ళపల్లి లో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి కి చెందిన సల్లంగుల కృష్ణయ్య (55) ఒక్కసారిగా బ్రిడ్జిపై నుంచి మానేరు వాగులో దూకాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. తంగళ్ళపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.