ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు చేయాలి: సీపీఎం
ASR: కొత్తగా ప్రవేశపెట్టిన VBG-RAMG చట్టం రద్దు చేసి పాత MGNREGS చట్టం కొనసాగించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు బురిడీ దశరథ్ ఆధ్వర్యంలో అరకులోయ మండలం బస్కీ పంచాయతీ కొర్రగుడ, బారెంగిబంద గ్రామాల్లో మంగళవారం సంతకాలు సేకరించి ఇంటింటి కర పత్రాలు పంపిణీ చేశారు. 200 రోజులు పని దినాలు, రూ.600 వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.