VIDEO: యూరియా బస్తాల కోసం తప్పని తిప్పలు

BDK: ఇల్లందు మండలం కొమరారంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. కొమరారం పీఏసీఎస్ ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. ఎరువుల కోసం ఆధార్ కార్డులు క్యూ లైన్‌లో పెట్టి రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చివరికి ఒక్క రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను అందించారు. చాలామంది రైతులు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు.