నంద్యాల జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త
NDL: నంద్యాల అయ్యప్ప స్వాములకు జిల్లా వాసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నంద్యాల మీదుగా కేరళలోని శబరిమలైకి 10 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు. మచిలీపట్నం నుంచి కొల్లం వరకు 5 ప్రత్యేక రైలు కొల్లం నుంచి నంద్యాల వైపు 5 స్పెషల్ రైలు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారులకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.