గోవధ చేస్తే చర్యలు.. కమిషనర్ వెంకటేశ్వరరావు

W.G: నరసాపురం శనివారం నాడు మున్సిపల్ కమిషనర్ పశువుల మాంసం విక్రాయిదారులతో సమావేశం ఏర్పాటు చేసి గోవధను వివరించారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశానుసారం గోవధ చేయడం చట్ట విరుద్ధం అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోవధ, గోవులను వధించే నిమిత్తం రవాణా చేయడం రాష్ట్రంలో నిషేధింపబడినదని హెచ్చరించారు.