విభిన్న ప్రతిభావంతులకు ఒలింపిక్స్ పోటీలు

VSP: విశాఖ పోలీస్ గ్రౌండ్‌లో శనివారం విభిన్న ప్రతిభావంతుల కోసం ఒలింపిక్స్ క్రీడాపోటీలు నిర్వహించారు. మూడు జిల్లాల నుంచి వచ్చిన వికలాంగుల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్, 900 మంది క్రీడాకారులను అభినందిస్తూ వారిని స్ఫూర్తిదాయకులుగా ప్రశంసించారు. ఈ పోటీలు గత 21 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.