'ఏయూ లైబ్రరీని ఆధునికీకరించాలి'
VSP: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విశాఖ ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం డాక్టర్ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయంలోని పుస్తక ప్రదర్శనను సందర్శించారు. గ్రంథాలయాన్ని దశలవారీగా పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని ఆయన సూచించారు. అరుదైన తాళపత్రాలు, పుస్తకాల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.