వేంపల్లెలో వైసీపీ సంతకాల సేకరణ
KDP: వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు జారీ చేసిన జీవో 590ని రద్దు చేయాలని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వైసీపీ మండల ఉపాధ్యక్షుడు రవిశంకర్ గౌడ్ ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.