ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
AKP: నాతవరం మండలం బెన్నవరం, వైడీపేట, నాతవరం గ్రామాల్లో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నాగలక్ష్మి బుధవారం ఇంటి పన్ను బకాయిల వసూళ్ల ప్రత్యేక డ్రైవ్‌ను పరిశీలించారు. పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ నెల 15 నాటికి శతశాతం వసూళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.