ఆర్ట్స్ కళాశాలలో తక్షణ ప్రవేశాలు

ATP: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ నాలుగో సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ పద్మశ్రీ తెలిపారు. బీఏ ఏడో సెమిస్టర్‌లో అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం, బీఎస్సీ ఏడో సెమిస్టర్‌లో గణితం, భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రంలో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు.