రైతుల సంక్షేమానికి పాటుపడతాం: ఛైర్మన్

రైతుల సంక్షేమానికి పాటుపడతాం: ఛైర్మన్

Srcl: రైతుల సంక్షేమానికి పాటుపడతామని చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గత 2 నెలల క్రితం పదవీ కాలం ముగియడంతో గడువు పెంచాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందడంతో తిరిగి శుక్రవారం వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.