కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షాలు

KRNL: జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం వరకు 14 మండలాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో సగటున 2.1 మి.మీ వర్షపాతం కురిసింది. ఆలూరు, ఆస్పరి, పత్తికొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం జిల్లాలో కనిపించలేదని, రానున్న రెండు-మూడు రోజుల్లో మరిన్ని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.