ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

KKD: కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో రూ. 9.6 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కుకు మంగళవారం ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పద్మశ్రీతో కలిసి శంఖుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వాన్ని సీఎం, డిప్యూటీ సీఎం రెండు కళ్లులా చూస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు భారీగా వస్తాయని అన్నారు.