ఎంపీ చిన్ని కార్యాలయంలో లోకేశ్ జన్మదిన వేడుకలు

కృష్ణా: విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ ఎంపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని కేక్ కట్ చేసి లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ రాష్ట్ర ప్రగతికి రథసారథిగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.