తెనాలిలో టీడీపీ సీనియర్ నేత మృతి

తెనాలిలో టీడీపీ సీనియర్ నేత మృతి

GNTR: తెనాలి ఐతానగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కన్నెగంటి వెంకటరావు (85) కన్నుమూశారు. ఆయన గతంలో నేలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడిగా, తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానం బోర్డు మెంబర్‌గా సేవలందించారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.