తుళ్లూరులో అంగన్వాడీల నిరసన
GNTR: అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం తుళ్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో లైబ్రరీ సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, తమ హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే అరెస్టులతో అణచివేయాలని చూడటం దారుణమని వారు మండిపడ్డారు.